భక్తి శ్రద్ధలతో ఘనంగా రంజాన్ వేడుకలు

 


ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు.
తుగ్గలి జూన్ 5 (globelmedianews.com)
భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని తుగ్గలి,జొన్నగిరి మరియు పెండేకల్ గ్రామాలలో మత పెద్దల ఆధ్వర్యంలో వేకువజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మత పెద్దల సమక్షంలో మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పర్వదినం రోజున ఈద్గా మత పెద్దలు రంజాన్ పండుగ యొక్క గొప్పతనం గురించి వివరించారు.


భక్తి శ్రద్ధలతో ఘనంగా రంజాన్ వేడుకలు
అదేవిధంగా రంజాన్ పండగ రోజు చేయవలసిన దానధర్మాలు గురించి వివరించారు.అదేవిధంగా  రంజాన్ పర్వదినం ఖురాన్ యొక్క గొప్పతనం గురించి వివరించారు.ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దల ఆశీర్వాదం పొంది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 30 రోజుల రంజాన్ మాసానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను జరుపుకుంటారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

No comments:
Write comments