ప్రవేట్ కాలేజిల ఫ్లెక్సీలు దగ్ధం ఏఐఎస్ఎఫ్

 


ఎమ్మిగనూరు జూన్ 15  (globelmedianews.com)
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న రావూస్ డిగ్రీ కాలేజ్, గుడ్ బేస్ స్కూల్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  ఫ్లెక్సీలు హోర్డింగ్లు చించి దగ్ధం చేశారు పెద్ద పార్క్ నుండి ఫ్లెక్సీలను తొలగిస్తూ సోమప్ప సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ అద్వర్యం లో ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు రంగస్వామి,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర వారు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు.


ప్రవేట్ కాలేజిల ఫ్లెక్సీలు దగ్ధం ఏఐఎస్ఎఫ్  
అని తక్కువ క్వాలిఫీకేషన్ ఉన్న ఉపాధ్యాయులతో బోధన పద్ధతిని చేయిస్తున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు బట్టి చదువులు చదివించి వారియొక్క జివితలను నాశనం చేస్తున్నారని వారు ఆవేదన వక్తంచేశారు,రావుస్ కాలేజీ, మరియు గుడ్ బేస్ స్కూల్ పై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వనికి డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు,పట్టణ కార్యదర్శి, మధు,ఆసీఫ్,రఘు,ఈరన్న,మల్లన్న,తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments