తుడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి

 

తిరుపతి, జూన్ 17, (globelmedianews.com)

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.తుడా కార్యాలయానికి చేరుకున్న చెవిరెడ్డికి అక్కడి ఉద్యోగులు, వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. 


తుడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి
సర్వమత ప్రార్థనల అనంతరం ఆయన తుడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు, వైకాపా నేతలు ఈ సందర్భంగా చెవిరెడ్డిని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అశయాలకు అనుగుణంగా అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పారు.

No comments:
Write comments