బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డు

 


వరంగల్, జూన్ 28, (globelmedianews.com)
ఖరీఫ్‌‌‌‌ సీజన్‌‌‌‌ మొదలైంది. వానలు పడుతున్నయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో పడ్డరు. కూలీలకు, ట్రాక్టర్‌‌‌‌ కిరాయి, విత్తనాల కొనుగోలుకు సొమ్ము కావాలె. ఈ మధ్య అమ్మిన వడ్లు, మక్కల పైసలు బ్యాంకు అకౌంట్లలో పడ్డయి. రైతు బంధు పైసలు కూడా వచ్చినయి. ఆ సొమ్ము తీసుకుని పొలం పనులు చేసుకోవాలె. కానీ బ్యాంకుల్లో పైసలిస్తలేరు. అకౌంట్లలో సొమ్మున్నా నగదు లేదనుకుంట.. రోజుకు పది వేలో, ఇరవై వేలో చేతిలో పెడుతున్నరు. కొన్ని చోట్ల అయితే ‘నో క్యాష్’అని బోర్డులు పెడుతున్నరు. ఏటీఎంలలో కూడా డబ్బులు ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో నగదు కొరత మరింత ఎక్కువగా ఉంది. రోజూ వెయ్యి మందికిపైగా ఖాతాదారులు వస్తుంటారు. వీరిలో 90 శాతం డ్వాక్రా మహిళలు, రైతులే. రైతులు ఇటీవల వడ్లు, మక్కలు అమ్మడంతో బ్యాంకులో డబ్బులు పడ్డాయి. పంటల సీజన్‌‌‌‌ కావడంతో డబ్బులు తీసుకునేందుకు వారంతా బ్యాంకుకు వస్తున్నారు. కానీ నగదు లేదంటూ రోజు పది, ఇరవై వేలకు మించి ఇవ్వడం లేదు. దానికీ గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. 

బ్యాంకుల్లో  నో క్యాష్ బోర్డు 

రోజూ బ్యాంకు దగ్గర లైన్లో నిలబడితే పొలం పనులు ఎవరు చూసుకోవాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనైతే రైతులు అరిగోస పడుతున్నరు. రోజూ వచ్చి బ్యాంకుల ముందు లైన్ల నిలబడితె… పొలం పనులు చేసుకునుడు ఎట్లాగని వాపోతున్నరు. అకౌంట్లలో పైసలు ఉన్నా కూడా బయట అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నరు.రబీ‌‌లో పండించిన వడ్లు, మక్కలను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రైతులకు సంబంధించి వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. రైతులు ఆ డబ్బుల కోసం బ్యాంకులకు వెళుతున్నారు. దీంతో బ్యాంకుల్లో భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పొద్దున బ్యాంకుల తలుపులు తెరవక ముందే వెళ్లి వేచి ఉంటున్నారు. రైతులకు తోడు డ్వాక్రా మహిళలు, ఉపాధి‌‌ కూలీలు కూలీలు కూడా వస్తున్నారు. బ్యాంకు సిబ్బంది నగదు కొరత కారణంగా అందరికీ డబ్బులు ఇవ్వలేక.. ఒక్కొక్కరికి రోజుకు పది, ఇరవై వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇంకా కావాలంటే మరునాడు రమ్మంటున్నారు. కనీసం ఏటీఎంలకు వెళ్లి సొమ్ము తీసుకుందామనుకున్నా.. ఎక్కడా డబ్బులు ఉండటం లేదు. కేవలం పట్టణాల్లోని ఏటీఎంలలో మాత్రమే క్యాష్ నింపుతున్నారు. అక్కడా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు పనులు వదిలేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు స్కూళ్లు మొదలుకావడంతో పిల్లల ఫీజుల కోసం డబ్బు తీసుకునేందుకు జనం బ్యాంకులకు వెళుతున్నారు. వారికీ ఇబ్బంది తప్పడం లేదు.పెద్ద నోట్ల రద్దు సమయంలో జనమంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయినయని, నగదుకు కొరత వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎలక్షన్ల సమయంలో చాలా నగదు విత్డ్రా అయిందని, కానీ డిపాజిట్లు రాక నగదు కొరత ఏర్పడిందని అంటున్నారు

No comments:
Write comments