టీఆర్ఎస్ ముక్కలవుతుందనే కేసీఆర్ కు భయం

 


ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: (globelmedianews.com)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ నేత,  ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ చీలికవర్గం ఇచ్చిన లేఖ కూడా సీఎం ఇంట్లో తయారైందని ఆయన ఆరోపించారు. అవసరమైతే సుప్రీంకు వెళ్తామని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలు జరిగాయో ఆధారాలతో సహ నిరూపిస్తామని, కేసీఆర్ చేస్తున్న గలీజ్, నీచ నికృష్ట రాజకీయాలను తెలంగాణలో ప్రతి పౌరుడికి అర్ధమయ్యేలా చెబుతామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ ముక్కలవుతుందనే కేసీఆర్ కు భయం
కేసీఆర్ గెలుపులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అనుమానం ఉన్నా.. ప్రజాతీర్పును గౌరవిద్దామన్న సహనంతో ఉన్నామని ఎంపీ పేర్కొన్నారు. ఎందుకు కేసీఆర్ భయపడుతున్నారు?, కేటీఆర్, హరీశ్ వుకు పంచాయతీ వస్తే పార్టీ ముక్కలవుతుందని ఇప్పటి నుంచే భయపడుతున్నారా? అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు.. ఏం అవసరమొచ్చింది? అని కేసీఆర్ ను  ఎంపీ ఉత్తమ్ ప్రశ్నించారు.

No comments:
Write comments