చైన్ స్నాచర్ ఆరెస్టు

 


అద్దంకి జూన్ 27(globelmedianews.com
ప్రకాశం జిల్లా అద్దంకి, తాళ్లూరు, బల్లికురవ, నరసరావుపేట మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అద్దంకి పట్టణంలోని పసుమర్తి పాలెంకు చెందిన చల్లా సుబ్బారావు ను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు.. అద్దంకి మండలం ధర్మవరం వద్ద మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ పాల్పడగా అతను అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ద్విచక్రవాహనం స్టార్ట్ కాకపోవడం తో మహిళ అతని వద్ద ఉన్న చైన్ తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

చైన్ స్నాచర్ ఆరెస్టు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సింగరకొండ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా  చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు వద్దనుండి నాలుగు బంగారపు గోల్డ్ చైన్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు .బంగారు చైన్లు విలువ సుమారు 3.16 లక్షల గా ఉంటుందని దర్శి డిఎస్పి. నాగరాజు తెలిపారు నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

No comments:
Write comments