స్కూళ్లలో కనిపించని జలమణి పథకం

 


భద్రాద్రి, జూన్ 29, (globelmedianews.com)
ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శుద్ధ జలాన్ని అందించేందుకు జలమణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. దాదాపు అన్నిచోట్లా ఈ కార్యక్రమం అటకెక్కింది. ఆర్వో ప్లాంట్‌లను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకపోయింది. విద్యార్థులు ఇంటి నుంచే సీసాల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. జలమణి పథకం అటకెక్కింది. దీంతో విద్యార్థులకు శుద్ధజలం అందడం లేదు. తాగునీటికి చేతి పంపులపై ఆధారపడుతున్నారు. సీసాల్లో నీటిని నింపుకొని రోజంతా తాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఏజెన్సీ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను పరిశీలిస్తే చేతిలో ఓ వైపు పుస్తకాలు.. రెండోవైపు నీళ్ల సీసా ఉండాల్సిందే. ప్లాస్టిక్‌ వాడటం ప్రమాదకరం.

స్కూళ్లలో కనిపించని జలమణి పథకం

వీటిని వినియోగించరాదంటూ నిత్యం వింటూనే ఉంటాం. అయినా తాగునీటిని వాటిల్లో తీసుకెళ్తూ కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. మంచినీటి సీసాలను నెలల తరబడి వాటిని వినియోగించడం అంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్‌ పాత సీసాలతో కొత్త రోగాలను తెచ్చుకోవడమే అంటున్నారు వైద్యనిపుణులు. వీటిని తయారు చేయడంలో వాడే విషపూరితమైన రసాయనాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. అలాంటి ప్రమాదకర సీసాలను గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో విద్యార్థులు వినియోగించడం ఆందోళనకరం. వీటి వినియోగం వలన ఎన్నో రకాలుగా నష్టపోతారనేది విద్యార్థులకు ఉపాధ్యాయులు సైతం అవగాహన కల్పించడం లేదు. తక్షణం వారికి ఆ దిశగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు అవగాహన కల్పించినట్టయితే విద్యార్థులు వెంటనే అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌ సీసాల    వినియోగంతో మహిళలు, పురుషుల్లో సంతానోత్పత్తి  సమస్యలు వస్తాయి. అలాగే ప్రొస్టెడ్‌ క్యాన్సర్‌, లివర్‌ క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. ట సీసాలు శుభ్రంగా లేకపోవడంతో నీరు కలుషితమై వాంతులు, విరోచనాలు, విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఆడపిల్లల్లో గర్భసంబంధిత సమస్యలు తతెత్తుతాయి.  విద్యార్థులు ప్లాస్టిక్‌ సీసాలను ఎండలో పెట్టడం వల్ల నీరు వేడెక్కి సీసా తయారీలో వినియోగించిన రసాయనాలు అందులో కలుస్తాయి.

No comments:
Write comments