తెగిపడిన హై టెన్షన్ తీగలు..ఇద్దరి సజీవ దహనం

 


కడప జూన్ 17 (globelmedianews.com)
కడప జిల్లా  పులివెందుల నుండి కదిరి రింగ్ రోడ్డులోని గంగమ్మ దేవాలయం  వద్ద హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడిపోయాయి. ఆదే సమయానికి  బైకుపై వెళుతున్న ఇద్దరిపై తీగలు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.  బైక్ తో సహా ఇద్దరు వ్యక్తులు కాలి బూడిదైపోయారు.  మృతులు గోవర్దన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలుగా గుర్తించారు. గోవర్ధన్ రెడ్డి  స్వస్థలం వేముల మండలం నల్ల చెరువు పల్లె ప్రతాప్ రెడ్డి స్వస్థలం లింగాల మండలం గుణకనపల్లె. 

తెగిపడిన హై టెన్షన్ తీగలు..ఇద్దరి సజీవ దహనం

No comments:
Write comments