చిత్తశుద్దితో సంక్షేమ పథకాలు

 


వరంగలు అర్బన్, జూన్ 25, (globelmedianews.com):
ప్రజల అవసరాలకు అనుగుణంగా పుట్టిన బిడ్డ మొదలుకుని వయోవృద్దుల వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్దితో అమలు చేయడం జరుగుతుందని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హన్మకొండ ఆర్ట్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన హన్మకొండ, కాజీపేట మండలాల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ కిట్ మొదలుకుని ఆసరా పింఛన్ వరకు అన్ని వర్గాల వారికి ప్రభుత్వ  సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యక్రమాలు ప్రవేశపెట్టి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు బాగస్వామ్యం చేసి సమర్ధవంతం గా అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 


చిత్తశుద్దితో సంక్షేమ పథకాలు
సంక్షేమ పథకాలు అమలుతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి, విద్య, వైద్య రంగాల అభివృద్ధి తో పాటు ప్రజలకు త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు, రైతు సంక్షేమ పథకాలకు పెద్ద పీఠవేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం కాజీపేట, హన్మకొండ మండల పరిధిలో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి 193 లబ్లిదారులకు రూ. 1 కొటి 77 లక్షల 76 వేల 808 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కాజీపేట మండల పరిధిలో 40 చుక్కులకు గాను 21 మంది ఎస్పీలబ్ధిదారు లకు కళ్యాణాలక్ష్మి ద్వారా రూ.20 లక్షల 27 వేల 436, ఇద్దరు ఎస్పీ లబ్దిదారులకు రూ.1 లక్ష 77 వేల 732, షాదిముబారక్ ద్వారా 17 మంది లబ్దిదారులకు హన్మకొండ మండల పరిధిలో 153 చుక్కులకు గాను రూ.1 కోటి39 లక్షల 72 వేల 168 షాదిముబారక్ ద్వరా 61 మంది ,లబ్దిదారులకు రూ.56 లక్షల 58 వేల 844, రూ.60 వేల 696, 63 మంది బిసి లబ్దిదారులకు రూ.55 లక్షల 34 వేల 76 రూసాయల చెక్కులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కాజీపేట, హన్మకొండ తహాశీల్దార్లు బి.నాగేశ్వర్ రావు భాహుసింగ్, స్థానిక కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, అని శెట్టి సరిత , విజయ్ భాస్కర్, శ్రీలత, జక్కుల రమ, జోరిక రమేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments