హరీష్ అన్న నిర్ణయం...మాలో స్పూర్తి...

 


 ప్రజా సేవలో ఉన్న తృప్తి ఏ సేవలో ఉండదు... అప్పుడే ఈ జన్మకు సార్ధకత... 
- మున్సిపల్ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి
సిద్దిపేట, జూన్ 03(globelmedianews.com) :

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్బంగా సోమవారంమునిసిపల్ కౌన్సిలర్ మచ్చ వేణు గోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  మున్సిపల్  కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.జన హృదయ నేత...అభివృద్ధి నాయకుడు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినోత్సవం సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ ,సూడా డైరెక్టర్  మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట మునిసిపల్ కార్మికులకు చీరల పంపిణీ చేశారు.. 

హరీష్ అన్న నిర్ణయం...మాలో స్పూర్తి...
-ఈ సందర్భంగా మాట్లాడుతూ నా బర్త్ డే సందర్భంగా  ప్రజలకు ,సమాజానికి ఉపయోగ పడే సేవ చేయాలని హరీష్ అన్న మాట మాకు ఎంతో స్పూర్తి నిచ్చిందని, అభిమానులు సేవ చెసినపుడే జన్మ కు సార్ధకత అని అన్నారని..అందుకే ఈరోజు సిద్దిపేట లో సేవ కార్యక్రమాలు చేస్తున్నామని..సేవ లో ఉన్న తృప్తి ఏ పనిలో లేదు అని ఈ సందర్భంగా అన్నారు.. హరీష్ అన్న జన్మదినోత్సవం సందర్భంగా నా  స్వంత ఖర్చులతో 110 మంది మునిసిపల్ కార్మికులకు చిరల పంపిణీ చేశాను అన్నారు. అదేవిధంగా 10 వ వార్డులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మోహన్ లాల్, అడ్డగట్ల శేఖర్ , పోశెట్టి శ్రీకాంత్  చెపురి శేఖర్ గౌడ్ , నవీన్ , నర్సింలు  ,మహేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:
Write comments