ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వుండాలి

 


ఏలూరు, జూన్ 24 (globelmedianews.com)
 మీకోసంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు కొంతమంది అధికారులు నివేదికలు ఇవ్వడం పట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యం వేణుగోపాల్ రెడ్ది అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం 17వ తేదీ సోమవారం నిర్వహించిన మీకోసంలో 204 అర్జీలు రాగా, వాటిలో 136 పరిష్కరించినట్లు నివేదికలో చూపించి వాటిని క్లోజ్ చేశారని అయితే వాటిని ఒక్కొక్కటీ పరిశీలించగా కొందరు అదికారులు సమస్యను వేరే శాఖలకు పంపడం, ఏదోఒక సమాధానం వ్రాయడం ద్వారా వాటిని పరిష్కరించినట్లు చూపారని అది సమంజసం కాదన్నారు. 

ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వుండాలి

ప్రజలు ఏమి ఆశించి అర్జీ ఇచ్చారో ఆసమస్య పరిష్కారం అయినప్పుడే అది ముగింపు చేసినట్లవుతుందని అన్నారు. కొంతమంది అధికారులు జీరో నివేదికలు ఇవ్వడానికి చూస్తున్నారే తప్ప చిత్తశుద్దితో పరిష్కరించడం లేదన్నారు. అధికారులలో సేవా దృక్పదం ఉండాలన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వుండాలన్నారు. ప్రతిసోమవారం మీకోసంలో వచ్చే అర్జీలు వచ్చే శుక్రవారంలోగా పరిష్కరించాలని, పరిష్కారానికి సమయం కావాల్సివస్తే వాటిని పెండింగ్ లో చూపాలన్నారు. మరికొంతసమయం తీసుకుని అర్జీలను సక్రమంగా విచారణచేసి అర్జీ దారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు నివేదికలు ఇచ్చిన అర్జీలను తిరిగి ఒపెన్ చేసి పరిశీలించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులును ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ .2 బిఆర్ అంబేద్కర్ , డిఆర్ఒ ఎన్ సత్యనారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఇ అమరేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.శంకరరావు, డియంఅండ్‌హెచ్ఒ డా. సుబ్రహ్మణ్యశ్వరి, డిఇఒ సివి రేణుక, మత్స్యశాఖ జేడి డా.అంజలి, డిఎస్ఒ మోహన్‌బాబు, దివ్వాంగులసంక్షేమశాఖ ఎడి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి  విజయకుమారి, సాంఘిక సంక్షేమశాఖ డిడి రంగలక్ష్మీదేవి ఇతరశాఖ అధికారులు పాల్గొన్నారు.

No comments:
Write comments