జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానం

 


జగిత్యాల  జూన్ 5 (globelmedianews.com):
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సేవలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో వచ్చినందుకు వైద్యశాఖ సిబ్బందిని బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఏ. శరత్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఏ. శరత్ మాట్లాడుతూ కంటి వెలుగు రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చినందుకు కలెక్టర్ సిబ్బందిని అభినందించారు .అదేవిధంగా కంటి వెలుగు తో పాటు కెసిఆర్ కిట్ల పంపిణీ  వైద్య నిర్వహణలో కామ కల్పన కూడా జిల్లాకు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదేవిధంగా కష్టపడి పనిచేయాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని కోరారు .ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును 15 ఆగస్టు 2018న ప్రారంభించగా జగిత్యాల జిల్లాలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం 6,47,684 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 70, వేల 770 మందికి రీడింగ్ అద్దాలు అందించడం జరిగిందని. 71, 499 మందికి డిస్క్రిప్షన్ ప్రకారం అద్దాల పంపిణీతో పాటు 14 ,984 మందికి కంటి ఆపరేషన్ కోసం అర్హులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. దాదాపుగా 8 నెలల్లో వైద్య సిబ్బంది ఇరవై మూడు బృందాలుగా ఏర్పడి 2, 654 శిబిరాలను గ్రామ, గ్రామాన నిర్వహించారని రోజు వారీగా సమీక్ష నిర్వహించి జిల్లావ్యాప్తంగా శిబిరాలను ఏర్పాటు చేసి టార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం సంపాదించగా జూన్ 2, 2019 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రానా ద్వారా ప్రశంసా పత్రాన్ని జిల్లాకు అందజేశారన్నారు. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానం
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కిట్ పంపిణీ జిల్లావ్యాప్తంగా గర్భిణీ స్త్రీలను గుర్తించడంతోపాటు వారికి అన్ని రకాల వైద్య సేవలు అందించుటకు గాను వైద్య సిబ్బందిని ఏమి చేద్దాము జరిగిందని చెప్పారు. ఈకార్యక్రమంపై సమీక్ష నిర్వహించడం జరిగిందని అలా వ్యాప్తంగా జూన్ ,2017 నుంచి మే ,2019 వరకు జిల్లాలో 23, 789 మంది గర్భిణీ స్త్రీలుగా నమోదు చేయడం జరిగిందని. 13,387 మందికి లబ్ధిదారులకు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 16,858 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కాగా కెసిఆర్ కిట్ 14,789 మందికి అందించడం జరిగిందని. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని లబ్ధిదారులకు 12కోట్ల 44 లక్షల ఖర్చు చేయడం జరిగిందన్నారు. గర్భవతులకు త్వరితగతిన నమోదు చేయడం గర్భవతులకు నాలుగు ఆరోగ్య పరీక్షలు, ప్రభుత్వ 
ఆసుపత్రుల్లో ప్రసవాలు ,వ్యాధి నిరోధక టీకాలు మరియు టిబి వ్యాధి గ్రస్తులను గుర్తించడం వంటి పలు రకాల సేవల్ని కార్యక్రమాల్ని ఆన్లైన్లో పొందుపరచడంలో మన జిల్లా మార్చి ,ఏప్రిల్ 2019 మాసంలో రాష్ట్రం లోనే మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల నిర్వహణలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వచ్ఛత మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం  కాయకల్ప అమలు ఇది వాట్స్అప్ ఎట్లా చేస్తుంది నిర్వహణకు గాను జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు మోతే వాడ ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి .ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలు పారిశుధ్యం మరియు శుభ్రత బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వ్యాధి నియంత్రణ పద్ధతులు సహాయ సిబ్బంది సేవలు పరిశుభ్రత అభివృద్ధి ముఖ్య అంశాలుగా కాయ కల్పన పథకం నిర్వహణ జరుగుతుందన్నారు . ఈ పథకం ద్వారా ఎంపికైన ఇద్దరు ఇక్కడ సన్మానమే ఉన్నదా ఆరోగ్య కేంద్రాలుగా ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సంక్రమిత వ్యాధుల పరీక్షలు నిర్వహణలో గ్రామాలలో 2, 88,156 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది, బీపీ షుగర్, గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పేషెంట్లకు తగు సూచనలు సలహాలు ఇవ్వడంతోపాటుగా పేషెంట్ ఆరోగ్య పరిస్థితి బట్టి ఉన్నత వైద్యుల సేవలకు సిఫారసులు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందని సి బి నాట్ వైద్య పరిక్షలు నిర్వహించడంలో సెంటర్లకు ఇంతవరకు రూపాయిలు 25 లక్షలు చేయడం జరిగింది పేషెంట్లకు నాణ్యమైన ఆహారం అందించడం కోసం ప్రతినెల ఐదు వందల రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుందని పర్సంటేజ్ పరంగా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది జిల్లావ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జిల్లాలో కలెక్టర్ ఆదేశాలతో వారితో వారి పర్యవేక్షణలో వారు అందిస్తున్న స్ఫూర్తితో అన్ని పథకాలను జిల్లాలో విజయవంతముగా చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో రావడం జరిగిందని వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ , డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జైపాల్ రెడ్డి ,ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సమీమ్ ఉద్ధిన్ ,డాక్టర్ 
శ్రీనివాస్ ,డాక్టర్ శ్రీపతి ,డాక్టర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments