ఏపీ అవతరణ

 

అక్టోబర్ ఫస్టా, నవబర్ ఫస్టా

విజయవాడ, జూన్ 5 (globelmedianews.com)
వైఎస్ జగన్ చాల విషయాల్లో వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరు. ఆయన తండ్రి వారసత్వం కూడా అందుకు దోహదపడుతోంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకేసారి పార్టీ అభ్యర్ధుల ప్రకటన అయినా, దూకుడుగా రాజకీయం చేయడంలో అయినా, వేల కిలోమీటర్ల పాదయాత్రను మొండిగా చేయడంలోనైనా జగన్ లోని విలక్షణత కనిపిస్తుంది. అన్న నందమూరి పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ఏకంగా కృష్ణా జిల్లాలో ప్రకటించి నాటి టీడీపీ సర్కార్ కి వెన్నులో చలి పుట్టించిన జగన్ ఇపుడు ఆధికారంలో ఉన్నారు. మరి ఆయన ఆలోచనలు అమలు చేసేందుకు అవకాశం లభించింది.ఇక ఏపీ ఎపుడూ కోరుకోని విధంగా విభజ‌నకు గురి అయింది. నాడు సమైక్య నినాదం వినిపించినా విడగొట్టారు. 


ఏపీ అవతరణ
ఆ బాధ ఎటూ ఉంది. దానికి తోడు అన్నట్లు నాటి పాలకులు తెలంగాణా ఆవిర్భావ రోజు అయిన జూన్ 2వ తేదీనే ఏపీకి అంటగట్టి రాజకీయ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అక్కడ తెలంగాణాలో సంబరాలు జరుగుతూంటే ఇక్కడ ఏపీలో కసి కోపంతో పనిచేయాలంటూ చంద్రబాబు నవ నిర్మాణ దినోత్సవాన్ని వారం పాటు నిర్వహించారు. అసలు ఏపీకి ఓ పుట్టిన రోజే లేదా. ఎందుకి ఈ ఏడుపు రోజు, ఎందుకు ఈ గాయాల కెలుకుడు అంటూ కోట్లాది ఆంధ్రులు ప్రశ్నించినా నాటి బాబు సర్కార్ పట్టించుకోలేదు సరికదా అయిదేళ్ళు ఇదే మా విధానం అని చెప్పుకొచ్చింది.ఇక ఏపీ ఆవిర్భావ దినంగా ఏ తేదీని నిర్ణయించుకోవాలని కేంద్రాన్ని కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం అడిగింది. దానికి బదులుగా మద్రాస్ నుంచి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన అక్టోబర్ 1 నే జరుగుకోవాలని కేంద్రం సూచించింది. అయితే చంద్రబాబు తాను తొలి సీఎం గా ప్రమాణం చేసిన జూన్ 8వ తేదీని ఏపీ దినోత్సవంగా చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి క్లారిటీ సరిగ్గా ఉంది. ప్రజల్లోనూ అక్టోబర్ 1 అన్న భావన ఉంది. మరి ఆ తేదీని ఎందుకు ప్రకటించకూడదూ అని నాడు మేధావులు కూడా నిలదీసినా ఫలితం లేకుండా పోయింది.ఇక ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన నవ నిర్మాణ దీక్షలను జరపడంలేదు. అంతే దాని అర్ధం ఏపీకి పండుగ రోజు మరో తేదీని నిర్ణయించాలన్న ఉద్దెశ్యం అయి ఉండాలి. జగన్ సైతం గతంలో అక్టోబర్ 1 కానీ, నవంబర్ 1 కానీ ఏపీ ఆవిర్భావ దినంగా జరపాలని కోరారు. మరి ఇపుడు ఆయన చేతిలో పని కాబట్టి ఆ రెండు తేదీలో ఒక దాన్ని ఏపీకి నిర్ణయించి ఘనంగా గౌరవంగా ఏపీ పండుగను నిర్వహిస్తారని అంతా ఆశిస్తున్నారు.

No comments:
Write comments