ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : మండలంలో బంద్ ప్రశాంతం

 


కౌతాళం జూన్28 (globelmedianews.com
మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్య పటిష్టపర్చాలని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా వ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ కన్వీనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సంధర్భాంగా నాగరాజు మాట్లాడుతూ   కేజీ నుండి పిజి వరకు బ్రాండ్ పేరుతో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టి మరియు కమిటీలు ఏర్పాటు చేసి  ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. 

 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : మండలంలో బంద్ ప్రశాంతం

జీవో నంబర్-1 ఉల్లంఘిస్తున్నా కార్పొరేట్ ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాలలో పుస్తకాలు మరియు బట్టలు ,స్టేషనరీ అమ్మకాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. 3. విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్యా సంవత్సరమే పటిష్టంగా అమలు పరచాలని పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అమ్మ ఒడి పథకాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుంది అయితే ప్రభుత్వ పాఠశాలలో పటిష్ట మార్చాలని కార్పొరేట్ పాఠశాలపై ఉక్కుపాదం మోపాలి.   గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని.విద్యాశాఖ అధికారులు పోస్టులను భర్తీ చేయాలని మరియు డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు.       ఈ కార్యక్రమం లో రాఘవేంద్ర, మౌనెష్, వీరెష్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొనారు.

No comments:
Write comments