నీటి కోసం రోడ్డెక్కిన గిరిజనులు

 


సిద్దిపేట, జూన్ 29, (globelmedianews.com)
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పేట మండలం రామవరం గ్రామ పరిధిలోని బంగారిలొద్ది తండా గిరిజనులు  తమ తాగునీటి సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. 15 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా చేయడం లేదని 
నీటి కోసం రోడ్డెక్కిన గిరిజనులు

మిషన్ భగీరథ నీటి జాడే లేదని సర్పంచ్ కు పలుమార్లు  మా నీటి సమస్య గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్య తెలుసుకున్న అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ   గిరిజనులతో  మాట్లాడి నీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

No comments:
Write comments