అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న రేవంత్

 


హైద్రాబాద్,  జూన్ 29, (globelmedianews.com)
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో వున్నా కెసిఆర్ పై మాత్రం యుద్ధం కొనసాగిస్తూనే వస్తున్నారు. టిడిపి లో వున్నప్పుడు మొదలైన రేవంత్ రెడ్డి వెర్సెస్ కెసిఆర్ యుద్ధం ఓటుకు నోటు కేసుతో క్లైమాక్స్ కు చేరింది. ఆ తరువాత ఓటమి ఎరుగని రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లో పట్టు పట్టి గులాబీ టీం ఓడించి అన్ని విధాలా రేవంత్ రెడ్డి ని అవుట్ చేసింది. అయితే పడిలేచిన కెరటం లా రేవంత్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచి మరోసారి తన సత్తా చాటుకుని కెసిఆర్ కు ప్రశాంతత దూరం చేసేందుకు నడుం కట్టారు. తన పగ, ప్రతీకారాన్ని అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు ఆయన.

అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న రేవంత్

గులాబీ బాస్ కెసిఆర్ నవతెలంగాణ నిర్మాణానికి అసెంబ్లీ, సచివాలయ రూపు రేఖలు మార్చేందుకు సిద్ధమైయ్యారు. అనుకున్నట్లే కెసిఆర్ తన నూతన కలను సాకారం చేసుకునేందుకు శంకుస్థాపన చేసేసారు. ఆయన ఇలా ఆ పని చేశారో లేదో అలా కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి హై కోర్ట్ లో ఈ నిర్మాణాలు ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అవసరం లేకపోయినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది రేవంత్ అభియోగం. ఈ కేసు లో ఇప్పుడు టి సర్కార్ ప్రతివాదిగా నిలవాలిసి వస్తుంది. ఒకరకంగా ప్రభుత్వానికి ఇది కొంత చికాకు పెట్టె అంశమే. అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేయడంలో సక్సెస్ అయిన గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపును నిరోధించడంలో శ్రేణులు విఫలం కావడం పట్ల ఇప్పటికే అసంతృప్తి గా వున్నారు. ఆయన అనుకున్నట్లే ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్ణయాలపై అడుగడుగునా అడ్డుతగిలే మార్గాలను ఎంచుకుని చికాకు పెట్టేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇది రేవంత్ కి ఏమేరకు మైలేజ్ అందిస్తుంది ? కెసిఆర్ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయో రాబోయే రోజుల్లో తేలనుంది.

No comments:
Write comments