రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్ కు కట్టుబడి ఉన్నా!

 


రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు’’: విజ‌య‌శాంతి
హైదరాబద్ జూన్ 3 (globelmedianews.com)
14 ఏళ్ళ త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రీఎంట్రీ ఇస్తున్నదన్నవార్తలఫై లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి స్పందించారు.‘‘నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుంది. నేను మరలా సినీరంగ ప్రవేశం చేయడంపై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా అనే అనుమానం కొందరికి రావచ్చు. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నన్ను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గానూ నాకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. 


రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్ కు కట్టుబడి ఉన్నా!
అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తె వాళ్లు కూడా ఉన్నారు. 2014-2018 వరకు కాంగ్రెస్‌లో రాములమ్మ ఆక్టివ్‌గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా నా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను.పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు.. అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు’’ అని రాములమ్మ‌ తన సుదీర్ఘ ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌హేష్‌- అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. త్వ‌ర‌లో మొద‌లు కానున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. అయితే ఇన్నేళ్ళ త‌ర్వాత విజ‌యశాంతి మ‌ళ్ళీ సినిమాలలో న‌టించ‌డంపై అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు తాను రాజ‌కీయాల‌కి దూరం అవుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ నేపథ్యంలో త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది విజ‌య‌శాంతి.  

No comments:
Write comments