దేవునిపల్లిలో బెల్టు షాపుల బంద్..

 

పోలీసు దత్తత గ్రామంలో మొదటి అడుగు 

రంగారెడ్డి, జూన్ 8 (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గము ఫరూక్ నగర్ మండలంలోని దేవుని పల్లి గ్రామంలో అభివృద్ధికి మొదటి అడుగు పడింది. ఏ గ్రామంలోనైనా గొడవలు జరిగాయి అంటే వాటికి 70 శాతం కారణం విచ్చలవిడిగా మద్యం తాగి లేనిపోని గొడవలకు దిగడం రివాజు. ఘర్షణలకు కారణభూతమైన మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ గ్రామస్వరాజ్యాన్ని గంగలో కలుపుతున్న అక్రమ బెల్టు షాపు వ్యాపారులను పోలీసులు కనుగొని వారికి తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. 


 దేవునిపల్లిలో బెల్టు షాపుల బంద్..

షాద్ నగర్ ఇన్స్పెక్టర్ ఆరె శ్రీధర్ కుమార్ దేవునిపల్లి గ్రామాన్ని పోలీస్ శాఖ తరుపున దత్తత తీసుకొని, అన్ని విధాల గ్రామం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా దానికి అవసరమైన వనరులను, వాతావరణాన్ని కల్పిస్తూ ఈరోజు మొదటిసారిగా గ్రామానికి చెందిన ఎనిమిది మంది వ్యాపారులను కౌన్సెలింగ్ ఇచ్చారు. షాద్ నగర్  ఇన్స్పెక్టర్  శ్రీధర్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతోంది. శనివారం దేవునిపల్లి గ్రామంలో బెల్ట్ షాప్లు నడిపే ఎనిమిది మంది రాములు, కిషన్, జహంగీర్, శ్రీనివాస్, సర్వేశ్వర్, శ్రీనివాసరెడ్డి, రాజు, విజయ్ లకు గ్రామంలో మందు అమ్మొద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిని తహశీల్ధార్ ముందు బైండ్ ఓవర్ చెయ్యడం జరిగింది.ఒకవేళ మందు అమ్మితే లక్ష రూపాయలు తహశీల్ధార్ ద్వారా ఫైన్ కట్టవలసి ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు.

No comments:
Write comments