శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

 

తిరుమల జులై 17  (globelmedianews.com
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే. 
శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

బుధవారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. 

No comments:
Write comments