124 మద్యం బాటిళ్లు స్వాధీనం

 


తుగ్గలి జూలై 3 (globelmedianews.com)
తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి గ్రామంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో ఈడిగ శీన సన్నాఫ్ బల రాముడు అనే వ్యక్తి ఇంటిలో సోదాలు నిర్వహించగా 124 (180 ఎమ్.ఎల్) ఎంసి విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల తెలిపారు.


124 మద్యం బాటిళ్లు స్వాధీనం

 ఈడిగ శీన వ్యక్తిపై కేసు నమోదు చేసి,ఆదోని కోర్టుకు రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ సీఐ మంజుల తెలిపారు.బెల్టు షాపులను నిర్వహిస్తే ఎటువంటివారినైనా ఉపేక్షించేది లేదని,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై రాజశేఖర్ మరియు ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:
Write comments