పాకిస్థాన్‌లో సైనిక శిక్షణ విమానం కూలి17మంది మృతి

 

న్యూడిల్లీ జూలై 30 (globelmedianews.com)
పాకిస్థాన్‌లో ఓ సైనిక శిక్షణ విమానం మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్‌ సిటీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్లు సహా 17మంది మృతి చెంచారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
పాకిస్థాన్‌లో సైనిక శిక్షణ విమానం కూలి17మంది మృతి

గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన విమానం రావల్పిండి నగర శివారులోని నివాస సముదాయాల్లో కుప్పకూలింది.  మంటలు కుడా చెలరేగాయి. ప్రమాదానికి ముందు కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు తెగిపోయాయని.. అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దేశ రాజధాని ఇస్లామాబాద్ కు దగ్గరలో వున్న రావల్పిండిలో సైనిక స్థావరాలు అధికంగా వున్నాయి.

No comments:
Write comments