20 శాతం ఫీజులు పెంచుతూ నిర్ణయం

 


హైద్రాబాద్, జూలై 1, (globelmedianews.com)
ప్రైవేటు ఇంజనీరింగ్‌‌ కాలేజీల్లో ఫీజులను 20 శాతం వరకు పెంచుతూ అడ్మిషన్లు, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌‌ఆర్సీ) తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.50 వేలలోపు ఫీజులున్న కాలేజీల్లో 20 శాతం, రూ.50 వేలకుపైగా ఫీజులున్న కాలేజీల్లో15 శాతం మేర పెంచుతామని కమిటీ ప్రతిపాదించగా, మెజార్టీ కాలేజీలు దానికి అంగీకరించాయి. కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించిన తర్వాత తుది ఫీజులను ఖరారు చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌‌లో ఏఎఫ్‌‌ఆర్సీ చైర్మన్‌‌ జస్టిస్‌‌ స్వరూప్‌‌రెడ్డి అధ్యక్షతన ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీ మేనేజ్మెంట్ల సమావేశం జరిగింది. తాత్కాలికంగా 20 శాతం వరకు ఫీజుల పెంపును జస్టిస్ స్వరూప్రెడ్డి ప్రతిపాదించారు. ఇప్పటికే ఎంసెట్‌‌ కౌన్సెలింగ్‌‌ ఆలస్యమైందని, ఇంకా జాప్యం జరిగితే స్టూడెంట్లకు ఇబ్బంది అవుతుందని సూచించినట్టు తెలిసింది. 

 20 శాతం ఫీజులు పెంచుతూ నిర్ణయం

నెలన్నర రోజుల్లో పూర్తి స్థాయి ఫీజులను ఖరారు చేస్తామని చెప్పినట్టు సమాచారం. దీనిపై కాలేజీల ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని.. 30 శాతం పెంచాలని కొందరు, కనీసం 25శాతం పెంచాలని మరికొందరు పట్టుబట్టినట్టు తెలిసింది. చివరికి ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనకు అంగీకరించి, సంతకాలు చేశారు. ఫీజుల పెంపు కోసం కోర్టుకు వెళ్లిన 81 కాలేజీలు సమావేశంలో పాల్గొని, వాదన వినిపించాయి. 15 కాలేజీలు మినహా మిగతావి ఏఎఫ్‌‌ఆర్సీ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఫీజులు పెంచుకునేందుకు కోర్టు నుంచి అనుమతి పొందిన కాలేజీలతో అధికారులు మరోసారి మాట్లాడనున్నారు. అయినా వినకుంటే.. వాటి ఫీజులను వారం రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.కొన్ని కాలేజీల్లో ఫీజులపై క్లారిటీ రాకపోవడంతో ఎంసెట్‌‌ కౌన్సెలింగ్‌‌ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఫీజుల ఖరారుకు సమయం కావాల్సి ఉండటంతో.. కౌన్సెలింగ్ను మరో మూడు, నాలుగు రోజులు వాయిదా వేసే అవకాశం ఉందని ఏఎఫ్‌‌ఆర్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఫీజులపై క్లారిటీ వచ్చాకే.. కాలేజీల పేర్లను వెబ్‌‌సైట్‌‌లో పెట్టి, కౌన్సెలింగ్‌‌ ప్రారంభిస్తామన్నారు. నెలన్నర తర్వాత ఏఎఫ్‌‌ఆర్సీ నిర్ణయించిన ఫీజులను అమలు చేస్తారు. తాత్కాలికంగా నిర్ణయించినదానికన్నా ఎక్కువ ఫీజులుంటే స్టూడెంట్ల నుంచి వసూలు చేస్తారు, తక్కువగా ఉంటే ఆ మేర వెనక్కి ఇస్తారు.

No comments:
Write comments