టోక్యో యానిమేషన్ స్టూడియోలో పేలుడు 23మంది మృతి

 

టోక్యో జూలై 18 (globelmedianews.com
 జపాన్‌ లోని టోక్యో నగరంలో యానిమేషన్ స్టూడియోలో జరిగిన పేలుడులో 23మంది చనిపోయారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్పారు మొదటి అంతస్థులో ఈ పేలుడు సంభవించింది. ఉదయం 10.30 గంటల  ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
టోక్యో యానిమేషన్ స్టూడియోలో పేలుడు 23మంది మృతి 

ఓ వ్య‌క్తి గుర్తు తెలియ‌ని ద్ర‌వాన్ని బిల్డింగ్‌లో పార‌పోశాడ‌ని, దాంతో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడ్డవారికి స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.దాడి జ‌రిగింది. యానిమేష‌న్ స్టూడియో బిల్డింగ్‌లో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. మూడు అంత‌స్తుల బిల్డింగ్ నుంచి తెల్ల‌టి పొగ చెల‌రేగింది. స్టూడియోలోని మొద‌టి అంత‌స్తులో పేలుడు జ‌రిగిన్న‌ట్లు సాక్షులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ అనుమానితున్ని అరెస్టు చేశారు.

No comments:
Write comments