వంతెనపై నుంచి పడిన బస్సు: 29 మంది మృతి

 

లక్నో జూలై 8  (globelmedianews.com

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌ బస్సు.. ఆగ్రా సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి నాలాలో పడింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

వంతెనపై నుంచి పడిన బస్సు: 29 మంది మృతి

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.లఖ్‌నవూ నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

No comments:
Write comments