ఆరేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కీచకుడి అత్యాచారం

 


అనంతపురం జూలై 4, (globelmedianews.com)
నగరంలోని ఎర్రనాల కొట్టాలలో దారుణం చోటు చేసుకుంది.  ఆరేళ్ల చిన్నారిపై 40 సంవత్సరాల కీచకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.  చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కీచకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. 

ఆరేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కీచకుడి అత్యాచారం

రక్తస్రావం కావడంతో చిన్నారిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిని కీచకుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

No comments:
Write comments