కరీంనగర్‌లో కొత్తగా 500 పడకల ఆస్పత్రి భవనం: ఈటల

 


కరీంనగర్ జూలై 3 (globelmedianews.com)  
కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. 
కరీంనగర్‌లో కొత్తగా 500 పడకల ఆస్పత్రి భవనం: ఈటల

ప్రస్తుతమున్న 150 పడకలకు అదనంగా మరో 100 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతమున్న జిల్లా ఆస్పత్రిని కూడా విస్తరిస్తామని తెలిపారు. కరీంనగర్‌లో కొత్తగా 500 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తామన్నారు. పాత భవనం కూల్చివేసి ఏడాదిలోపు కొత్తభవనం నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

No comments:
Write comments