500 ఎకరాలు కొనుగోళ్లపై కలకలం

 

విజయవాడ, జూలై 30, (globelmedianews.com
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయన బంధువు భారీగా స్థలాలు కొన్నారా ? 500 ఎకరాల భూమిని బాలకృష్ణ,అతని బంధువు కొనుగోలు చేశారనే వార్త ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ భూమి కొనుగోలు ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ఓ ఇంగ్లీషు పత్రిక వెలువరించిన కథనం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరాతిని ప్రకటించడానికి ముందే మాజీ సీఎం చంద్రబాబు బావమరిది అయిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అతని బంధువు అమరాతిలో 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టలు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నాయకులకు, సన్నిహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 
500 ఎకరాలు కొనుగోళ్లపై కలకలం

అధికారంలో ఉండడం, మాజీ సిఎం చంద్రబాబు బంధువులు కావడంతో వారికి భూములను కట్టబెట్టారంటూ వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన అంతర్గత వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. ల్యాండ్ పూలింగ్ పథకం పేరిట రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. ప్రపంచబ్యాంక్ కూడా అమరాతికి రుణం ఇచ్చేందుకు  వెనక్కి తగ్గడానికి భూ సేకరణలో జరిగిన అవకతవకలే కారణమన్నారు.ఈ విషయంపై మంత్రి బుగ్గన ఇటీవలే అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో భారీ అవకతవకలు జరిగినట్లు, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు వివాదాస్పదంగా ఉన్నాయంటున్నారు. అమరావతిలో 1,691 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకున్నట్లు..సింగపూర్ కంపెనీ రూ. 306 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. మొత్తంగా రాష్ట్ర పెట్టుబడి రూ.10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లు కాగా 42 శాతం ప్రభుత్వానిది మైనర్ వాటా ఉంటే..సింగపూర్ కన్సార్టియం 58 శాతం కలిగి ఉందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాజధాని విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. సమావేశాలు ముగిసిన అనంతరం కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని..అమరావతిపై తన విధానాన్ని స్పష్టం చేసే అవకాశమున్నట్లు సమాచారం.

No comments:
Write comments