బాలకోట దాడులు... పాకిస్తాన్ కు 688 కోట్ల నష్టం

 


న్యూఢిల్లీ, జూలై 5 (globelmedianews.com
పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 200-300 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటించింది. పాకిస్థాన్ మాత్రం అక్కడ చెట్లు కూలాయి తప్పితే.. మనుషులెవరూ చనిపోలేదని వాదించింది. ఈ విషయాన్ని కాస్త పక్కనబెడితే.. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ కారణంగా పాకిస్థాన్‌కు సుమారు రూ.688 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మనం ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తే.. పాకిస్థాన్‌కు వందల కోట్లలో నష్టం వాటిల్లడం ఏంటని అనుకుంటున్నారా? ఫిబ్రవరి 26న బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ తన గగన తలాన్ని మూసివేసింది.

బాలకోట దాడులు... పాకిస్తాన్ కు 688 కోట్ల నష్టం


పాక్ మీదుగా మొత్తం 11 గగనతల మార్గాలు ఉండగా.. తర్వాత కేవలం దక్షిణ భాగాన ఉన్న రెండు గగనతల మార్గాలను మాత్రమే తెరిచింది. ఫలితంగా ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించాల్సిన విమానాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. పాక్ గగనతలం మీదుగా సగటున రోజుకు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఏంటట..? అనుకుంటున్నారా? ఓ దేశ గగనతలం మీదుగా ప్రయాణించినందుకు విమానయాన సంస్థలు విమాన బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ విషయానికి వస్తే.. బోయింగ్ 737 విమానానికి 580 డాలర్లు, ఎయిర్ బస్ 380కైతే ఇంకాస్త ఎక్కువగా పాకిస్థాన్ ఫీజ్ వసూలు చేస్తుంది. అలా పాకిస్థాన్‌కు రావాల్సిన సుమారు రూ.688 కోట్లు రాకుండా పోయాయి. 

No comments:
Write comments