ఫారిన్ బ్రాండ్స్ కు ఫుల్ డిమాండ్

 

హైద్రాబాద్, జూలై 22, (globelmedianews.com)
రాష్ట్రంలో విదేశీ బ్రాండ్ల మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. ధరలు ఎక్కువగా ఉన్నా కూడా ఏటేటా ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత మూడేళ్లుగా మందుబాబులు ఫారిన్ లిక్కర్ ఎక్కువగా కొంటున్నారని ఎక్సైజ్శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 27,43,915 బాక్సుల ఐఎంఎఫ్‌ఎల్‌ సేల్‌ అయింది. గతేడాది ఏప్రిల్లో ఇది 20,56,065 బాక్సులు మాత్రమే కావడం విశేషం. అంటే అమ్మకాల్లో 30 శాతం పెరుగుదల నమోదైంది. మే నెలను పరిశీలించినా గతేడాది కంటే 30 శాతం అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు 14,82,567 బాక్సుల ఐఎంఎఫ్ఎల్ అమ్ముడవగా.. గతేడాది ఇదే సమయంలో 12,72,276 కేసులు వినియోగమయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా లిక్కర్ అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ నెల ఒకటి నుంచి 16వ తేదీ వరకు రూ. 907 కోట్లుకాగా.. గతేడాది ఇదే సమయంలోరూ. 744 కోట్లు మాత్రమే. 
ఫారిన్ బ్రాండ్స్ కు ఫుల్ డిమాండ్

అంటే 22 శాతం పెరుగుదల నమోదైంది.గతంలో ఫారిన్‌ లిక్కర్‌ సేల్స్‌ చాలా తక్కువగా ఉండేవి. కొంతకాలంగా అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంపన్న వర్గాలు, ఎగువ మధ్యతరగతి వాళ్లు ఫారిన్ లిక్కర్ వైపు ఆకర్షితులవుతున్నారు. మొత్తంగా చూస్తే ఫారిన్ లిక్కర్ సేల్స్లో 90 శాతం వరకు హైదరాబాద్లోనే ఉన్నట్టు అంచనా. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలు, సంపన్నులు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, కూకట్పల్లి ప్రాంతాల్లో ఫారిన్ లిక్కర్ అమ్మే షాపులు వెలిశాయి. ఆయా చోట్ల ఉన్న రెస్టారెంట్లలోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నయి. గ్లోబల్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి విదేశీయుల రాక కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతోనూ ఫారిన్ లిక్కర్ సేల్స్ ఉంటున్నాయి. సాధారణ వైన్స్ షాపుల్లోనూ విక్రయాలను అనుమతి ఇవ్వడంతో జిల్లాల్లోనూ ఫారిన్ లిక్కర్ అందుబాటులో ఉంటోంది. అయితే జిల్లాల్లో కొంత ధర తక్కువగా ఉండే బ్రాండ్లే అమ్ముడవుతున్నాయని చెబుతున్నా

No comments:
Write comments