భారత్ ను ఉతికి ఆరేస్తున్న నెట్ జన్లు

 


హైద్రాబాద్, జూలై 1, (globelmedianews.com)
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తొలి పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టుపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో 338 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. ఆఖరికి 306/5కే పరిమితమైంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (102: 109 బంతుల్లో 15x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (66: 76 బంతుల్లో 7x4) దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో గెలిచేలా కనిపించిన భారత్ జట్టు.. 

భారత్ ను ఉతికి ఆరేస్తున్న నెట్ జన్లు

స్లాగ్ ఓవర్లలో మహేంద్రసింగ్ ధోని (42: 31 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12: 13 బంతుల్లో 1x4) పేలవ బ్యాటింగ్ కారణంగా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో.. ధోనీ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (111: 109 బంతుల్లో 10x4, 6x6) సెంచరీ బాదడంతో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో.. భారత బౌలర్లపై ఆఖరి వరకూ ఎదురుదాడిని కొనసాగించారు. ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో బెన్‌స్టోక్స్ (79: 54 బంతుల్లో 6x4, 3x6) విలువైన పరుగులు చేశాడు. ఛేదనలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య (45: 33 బంతుల్లో 4x4), రిషబ్ పంత్ (32: 29 బంతుల్లో 4x4) దూకుడు పెంచి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు కొనసాగించారు. కానీ.. ధోనీ, జాదవ్ జోడీ.. చివర్లో పరుగులు, బంతుల మధ్య అంతరం పెరుగుతున్నా.. సింగిల్స్‌, డిఫెన్స్‌తో సరిపెట్టి మ్యాచ్‌లో గెలుపు అవకాశాల్ని దూరం చేశారు. 

No comments:
Write comments