వెయిట్ లిఫ్ట్ విజేత శివరామకృష్ణ యాదవ్ కు ఘనస్వాగతం

 

రేణిగుంట, జులై 17  (globelmedianews.com
సమోయ్ -2019 పసిఫిక్ గేమ్స్ వెయిట్ లిఫ్ట్ లో కామన్వెల్త్ చాపియన్ బంగారు,  వెండి పధకాలు కైవసం చేసుకుని బుధవారం ఉదయం  రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కడప  స్పొర్ట్స్ స్కూల్ విద్యార్థి ఎ.శివరామకృష్ణ  యాదవ్ కు ప్రభుత్వం తరుపున ఘనస్వాగతం లభించించింది. ఈ క్రీడా పోటీలు ఈనెల 6 నుండి 15 వరకు సమోయ్  దేశంలో ఘనంగా జరిగాయి. ఈ క్రీడల్లో కడప స్పొర్ట్స్ స్కూల్ ఇంటర్ 2 వసంత్సర విధ్యార్థి ఎ.శివరామకృష్ణ పురుషుల – యువత  కేటగిరీ 81 కేజీల వెయిట్ లిఫ్ట్ లో బంగారు పథకం, పురుషులు – జూనియర్ కేటగిరీలో 81  కేజీల వెయిట్ లిఫ్ట్ లో వెండి  పథకం కైవసం చేసుకున్నాడు. 
వెయిట్ లిఫ్ట్ విజేత శివరామకృష్ణ యాదవ్ కు ఘనస్వాగతం 

శివరామకృష్ఫ రేణిగుంట విమానశ్రయం చేరుకుంటున్న నేపద్యంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా ఆదేశాలమేరకు ప్రభుత్వం తరుపున అధికారులు, క్రీడాకారులు, కోచ్ లు, విమానాశ్రయ అధికారులు , స్కూల్ విధ్యార్థులు, మీడియా ప్రతినిధులు  ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం అందుకున్న విజేత రామకృష్ణ అందరికి ధన్యవాదాలు తెలిపి కడప బయలు దేరి వెళ్లారు. సెట్విన్ సి ఈ ఓ లక్ష్మి, ఎఒ వరలక్ష్మి, చీఫ్ కోచ్ సయ్యద్ బాషా, క్రీడల కోచ్ లు ఉమాశంకర్, రమేష్, శ్రీలక్ష్మి కరణ, గోపి, పియిటి ఆంజనేయులు, కడప స్పోర్ట్ స్కూల్ కోచ్ లు శివశంకర్ రెడ్డి, ఖాదర్, హరి, ఎయిర్పోర్ట్ టర్మినల్ మేనేజర్ గోపాల్, సిఐఎసెఫ్ సిబ్బంది, గిరిజన పాఠశాల విధ్యార్థులు, మీడియా ప్రతినిధులు  స్వాగతం పలికారు. సెట్విన్ సి ఈ ఓ మాట్లాడుతూ గతంలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రమణ్యం  క్రీడల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా క్రీడలకు   ప్రాధాన్యత  నిచ్చారని ఫలితాలు వస్తున్నాయని అన్నారు. శివరామ కృష్ణ యాదవ్ తండ్రి మురళి కృష్ణ రైతు , తల్లి శ్రీవాణి గృహిణి.

No comments:
Write comments