నిబంధనలే ప్రకారమే విలీనం

 


హైద్రాబాద్, జూలై 18 (globelmedianews.com)
రాజ్యాంగ నిబంధనల ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయ్యారు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పీకర్ పోచారం స్పందిస్తూ.. ఆ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున చర్చకు అనుమతించబోమని స్పష్టం చేశారు. 

నిబంధనలే ప్రకారమే విలీనం

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ మమ్మల్ని నిందించడం ఎందుకు? 1/3వ వంతు సభ్యులు విలీన లేఖ ఇచ్చిన తర్వాత అది చట్టవిరుద్ధం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. కర్ణాటక, గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా, ఏం చెప్పినా.. ప్రజలు నమ్మలేదు. మొన్నటికి మొన్న జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. 32 జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 92 శాతం మండల పరిషత్‌లను, 83 శాతం గ్రామపంచాయతీలను గెలుచుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు

No comments:
Write comments