పాలమూరులో సాగు సంబరం..

 

పాలమూరు, జూలై  29, (globelmedianews.com
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మూడేళ్లుగా సాగు సంబరం కనిపిస్తున్నది. 4 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకరావడమే గొప్ప మార్పుకు సాంకేతంగా నిలుస్తుంది కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా మూడేళ్లుగా సాగునీటిని అందింస్తుండంతో రైతులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాలకు వానాకాలంలో సాగునీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.50 లక్షల ఎకరాలు, భీమా ఫేజ్ 1-2ల ద్వారా 1.70 లక్షలు, నెట్టెంపాడ్ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ 30 వేల ఎకరాలు,ఆర్డీఎస్ ద్వారా 25 వేల ఎకరాలు, జూరాల ద్వారా లక్ష ఎకరాల సాగునీళ్లు అందించాలని నిర్ణయించడంతో రైతులు సంబురపడుతున్నారు. 
పాలమూరులో సాగు సంబరం..

గతేడాది సహితం ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలు సాగు చేశారు. ఈ ఏడాది మరో 2 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించేలా ఏర్పాట్లు చేశారుఈ నాలుగు ప్రాజెక్టులతోపాటు జూరాల, ఆర్డీఎస్‌ల కింద ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సహితం ఆగస్టు చివరి నాటికి ఒక్క పంపునైనా ప్రారంభం చేసి తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీని ద్వారా ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టునంతటిని వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో పనులను జరిపిస్తుండటం శుభపరిణామంగా నిలుస్తున్నది.ముందు నుంచి ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పినట్లుగా ఈ ఏడాది లక్ష్యంగా చేసుకోవడం మరింత సంబురంగా కనిపిస్తుంది.వారం రోజులుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మోటర్లు సాగునీటిని ఎత్తిపోస్తున్నాయి. జూరాలకు వరద రావడంతోనే ముందుగా నెట్టెంపాడ్, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ప్రారంభించారు.  పంపులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాగే కేఎల్‌ఐలోని మొదటి, రెండో లిఫ్టుల్లో మోటర్లను సహితం ఇటీవలే ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు నీటిని ఎత్తిపోస్తుండటంతో సాగు సంబురం కనిపిస్తుంది. ఈ క్రమంలో నడుస్తున్న ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు, చెరువులకు జలకళ సంతరించుకోనున్నది. కేఎల్‌ఐ, భీమాల ద్వారా గతేడాది కంటే మించి సాగునీరందించేలా ఏర్పాట్లు చేశారు. 3.50 లక్షల ఎకరాల భారీ లక్ష్యంతో కేఎల్‌ఐ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలో పెద్దదిగా నిలుస్తుంది.ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సాగు సందడి మొదలైంది. గతంలో కేవలం జూరాల ఆధారంగా మాత్రమే లక్ష ఎకరాలకు సాగునీరందేది. స్వరాష్ట్ర పాలనలో ఊహించని విధంగా ఆయా నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరందిస్తున్నందుకు సాగు సంబురంగా కనిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అ చ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో ఆయా ప్రాజెక్టుల ద్వారా సాగు సందడి కనిపిస్తుంది. వరద ప్రవా హం మరికొద్ది రోజులు కొనసాగితే ఎత్తిపోతల పథకాల నుంచి అవసరమైన నీటిని తీసుకునేందుకు వెసలుబాటు కలుగుతుంది. నాలు గు ప్రాజెక్టుల పరిధిలో రిజర్వాయర్లు, చెరువుల ను నింపుకొనేలా మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం కల్వకుర్తి ప్రాంతానికి కేఎల్‌ఐ నీటిని అందించింది. కేఎల్‌ఐలోని 29వ ప్యాకేజీలో 160 కిలోమీటర్ల కాలువ ద్వారా కల్వకుర్తికి సాగునీరందించే క్రమంలో 90వ కిలోమీటరు దగ్గర దుందుభి నదిపై ఉన్న అక్విడెక్ట్ పనులు పూర్తి చేయించి కల్వకుర్తికి సాగునీరు ఇచ్చారు. కల్వకుర్తితో పాటు ఊర్కొండపేట, మిడ్జిల్ మండలాల్లోను మరికొన్ని చెరువులకు నీరందించారు. ఇంకా డీ-85 కింద 59 కిలోమీటర్ల అదనపు కాలువ తవ్వకానికి, 37 వేల 742 ఎకరాల అదనపు ఆయకట్టుకు ప్రత్యేక జీవో ద్వారా 178 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

No comments:
Write comments