వర్షం కోసం పూజలు.

 

తుంగా జలాలతో రామలింగేశ్వర స్వామికి అభిషేకం 
మంత్రాలయం జూలై 17, (globelmedianews.com)  
రామలింగేశ్వరస్వామి అర్చకులు బుధవారం వర్షం కోసం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో కలశములతో రామలింగేశ్వర శివవాలయం నుండి తుంగభద్ర నది తీరానికి ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అక్కడ తుంగభద్ర నదిలో గంగా పూజలు చేశారు. మహిళలు తెచ్చిన  గంగా జలమును  అర్చకులు రామలింగేశ్వర స్వామికు అభిషేకం నిర్వహించారు.  
వర్షం కోసం పూజలు. 

రామలింగేశ్వరస్వామి కి జలాభిషేకం పంచామృతాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించి మంగళహారతి నిర్వహించారు. భక్తులు వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రామలింగేశ్వర విశేష పూజలు నిర్వహించి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి అర్చకులు చిన్న శంకరయ్య స్వామి, సిధ్ధలింగయ్య స్వామి, వీరేశ స్వామి ,వీరభద్ర స్వామి , రుధ్రయ్య స్వామి,చంద్రశేఖర స్వామి ఎల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments