కియా బుకింగ్ స్టార్ట్స్

 

అనంతపురం, జూలై 16 (globelmedianews.com)
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ కియా మోటార్స్ తాజాగా తొలి కారు బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెల్టోస్ ఎస్‌యూవీ ప్రి-బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో లేదా సేల్స్ పాయింట్లకు వెళ్లి కారును బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీకి దేశవ్యాప్తంగా 265 సేల్స్ పాయింట్సు ఉన్నాయి. కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో కారును బుక్ చేసుకోవచ్చు. బీస్ 6 ప్రమాణాలకు అనుగుణమైన ఈ కారు ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 
కియా బుకింగ్ స్టార్ట్స్

ఒకటేమో జీటీ లైన్ (పర్ఫార్మెన్స్ కోరుకునే వారికోసం), రెండోదేమో టెక్ లైన్ (ఫ్యామిలీస్ కోసం). 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, 1.4 టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభ్యమౌతుంది. భారతీయ కన్సూమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ కారును రూపొందించామని, ఈ ఎస్‌యూవీ సంబంధిత విభాగంలో సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుందని కియా మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం‌ జిల్లాలోని పెనుగొండ వద్ద ఏర్పాటు చేసిన ప్లాంటులో తయారైన సెల్టోస్ కారును విదేశాలకు కూడా ఎగమతి చేస్తామని కంపెనీ తెలిపింది. ఇకపోతే కారు ధర తెలియాల్సి ఉంది. ధర రూ.11-రూ.17 లక్షల మధ్యలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్, నిస్సాన్ కిక్స్, రెనో క్యాప్చర్, టాటా హారియర్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్ ఎంజీ హెక్టార్‌తో కూడా పోటీపడొచ్చు

No comments:
Write comments