చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించరు: చెల్లుబోయిన

 

అమరావతి జూలై 23 (globelmedianews.com):
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్‌సీపీ సభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి బీసీ కమిషన్‌ బిల్లు తీసుకురావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం టీడీపీకి తగదని హితవు పలికారు. బీసీలకు జరిగే మేలును టీడీపీ వినలేకపోతున్నారని తప్పుబట్టారు. 
చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించరు: చెల్లుబోయిన

బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు బాగుపడిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మంజునాథ కమిషన్‌ చైర్మన్‌ను సైతం గౌరవించని మనస్తత్వం చంద్రబాబుదని వేణుగోపాల్‌ దుయ్యబట్టారు. ఐదేళ్లలో బీసీల కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్‌ బిల్లును తీసుకొచ్చినట్టు వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేని అంశాలను బీసీ కమిషన్‌ దృష్టికి తీసుకురావొచ్చునని పేర్కొన్నారు.

No comments:
Write comments