చెక్ పవర్ వచ్చిన ఆనందమే లేదు

 


హైద్రాబాద్, జూలై 4, (globelmedianews.com)
నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి ఐదు నెలలు కావొ స్తున్నా వారి గోడు ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో కొట్టామిట్టాడు తున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చేతిలో చిల్లిగవ్వలేక అభివృద్ధి ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. సరిగ్గా వేసవి సమయంలోనే కొలువుదీరిన వారికి చెక్‌పవర్‌ ఇవ్వకపోవడం వల్ల తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గానే మారింది. ఈ నేపథ్యంలో ఎలాగోలా దాన్నుంచి గట్టెక్కినా నేటికీ వారి పరిస్థితిలో పురోగతి లేదు. జూన్‌ 15న ప్రభుత్వం ప్రకటించిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ జాయింట్‌ చెక్‌పవర్‌కు సంబంధించి ఆర్డర్‌ రాకపోవడంతో గత పరిస్థితే పునరావృతమవుతున్నది.

చెక్ పవర్ వచ్చిన ఆనందమే లేదు


చెక్‌పవర్‌ లేక కార్యకలాపాలేవీ సాగడం లేదు. పారిశుధ్య కార్మికుల, జీపీ సిబ్బంది వేతనాలు నెలల తరబడి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జూన్‌ 17 నుంచి సంయుక్త చెక్‌పవర్‌ ఉంటుందని సర్కారు ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమల్లో లేకపోవడంతో నిధులున్నా వినియోగం కావడం లేదు.ఈయేడు దశలవారీగా కేటాయించిన 14వ ఆర్థిక సంఘం గ్రామాలకు నిధులు కేటాయించామని అధికారులు చెబుతున్నా అవి ఏ మూలకూ సరిపోవని నూతన సర్పంచులు భావిస్తున్నారు. వరుస ఎన్నికల కోడ్‌, ప్రత్యేక పాలనలో పల్లెల్లో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దాదాపు ఏడాదికాలంగా తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం, కరెంట్‌ బిల్లులు, సిబ్బంది వేతనాలు, కార్యాలయాల నిర్వాహణ.. ఇలా అనేక రకాల సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీకి సగటున రూ.6 లక్షల నుంచి 10 లక్షల నిధులు వచ్చినా పెండింగ్‌ పనులను పరిష్కరించేందుకు ఎటూ సరిపోని పరిస్థితి నెలకొంది. 50 శాతం కొత్త పనులకు, 15 శాతం పారిశుధ్యం, 10 శాతం తాగునీరు, 10 శాతం వీధిదీపాలు, కరెంటు బిల్లులు, 15 శాతం నిధులను ఇతరాలకు వినియోగించాల్సి ఉంటుంది. పంచాయతీకి సగటున రూ.4 లక్షలు వస్తే మరో 4 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన హామీపైనా నేటికీ ఎలాంటి కసరత్తు చేసిన దాఖలాల్లేవు. ఖమ్మం జిల్లాలో అసలు ఆర్థిక సంఘం నిధులొచ్చినట్టు సర్పంచులకు తెలియకపోవడం గమనార్హం.చెక్‌పవర్‌ ఇచ్చినా ఖాతాల్లో లావాదేవీలు ప్రారంభం కాకపోవడంతో అనేక గ్రామాల్లో ఇప్పటికీ సొంత డబ్బులతోనే సర్పంచులు పనులు కానిస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలో విద్యుత్‌, నీటి సరఫరా పనులకు స్థానిక సర్పంచ్‌ పోకల శివకుమార్‌ తన సొంత డబ్బులు ఖర్చు చేశారు. ఏడాదికాలంగా ఏ ఒక్క పనీ సక్రమంగా చేపట్టలేదనీ, టీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తినే అయినా ఇంత అధ్వానమా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం డాకుర్‌ గ్రామపంచాయతీలో 14వార్డుల్లో 5,800 జనాభా ఉండగా.. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 లక్షలు నిధులొచ్చాయి. చెక్‌పవర్‌ అమలుకు ఆదేశాలు రాకపోవడం, ప్రభుత్వం సీజింగ్‌లో పెట్టడంతో డబ్బులు తీసుకునే వీల్లేదని సర్పంచ్‌ వాపోతున్నాడు. గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే రూ.7 లక్షల వరకు ఖర్చుచేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.
జిల్లా                          14వ ఆర్థిక సంఘం నిధులు
                                 (కోట్ల రూపాయల్లో..)
ఖమ్మం                          26.01
భద్రాద్రి కొత్తగూడెం                19.94
జనగామ                        20.31
మహబూబాబాద్‌                 16.56
యాదాద్రిభువనగిరి               15.11
మెదక్‌                           16.82
భూపాలపల్లి                     17.66
ఉ.మహబూబ్‌నగర్‌               171
పంచాయతీల పట్ల ప్రభుత్వ తీరు చూస్తే నిర్వీర్యం చేసేలా ఉందనిపిస్తున్నది. ఆరు నెలల కిందట ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా చెక్‌పవర్‌ ఇవ్వలేదు. ఇచ్చామంటున్నా అమల్లోకి రాలేదు. మా గ్రామంలో 1600 మంది జనాభా ఉన్నారు. వేసవిలో తాగునీటికి తిప్పలు వస్తే అప్పులు చేసి నీరందించాం. పారిశుధ్య పనులు చేద్దామంటే చేతిలో డబ్బుల్లేవు. 

No comments:
Write comments