ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అడ్డుపెట్టుకొని బీసీ, ఓసీలను బెదిరింపు

 

భాధితులకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ 
హైదరాబద్ జూలై 26 (globelmedianews.com)
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అడ్డుపెట్టుకొని బీసీ, ఓసీ, ఈబీసీలను బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భాధితులకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రేణుకుంట్ల ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్ ఎస్ ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాధితులు ర్యాల కిష్టయాదవ్ తో కలసి ఆయన మాట్లాడారు. మెడ్చెల్ జిల్లా కార్మికనగర్ లోని సర్వే నెంబర్ 218 లో దమ్మాయిగూడకు చెందిన మామిళ్ల రమేశ్ కు ఏకరం స్థలం ఉంది. ఈ స్థలాన్ని బీసీసామాజిక వర్గానికి చెందిన ర్యాల కృష్ణయాదవ్ కు విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అడ్డుపెట్టుకొని బీసీ, ఓసీలను బెదిరింపు

అయితే రమేశ్ కు కృష్ణయాదవ్ 20 గుంటలకు రూ.40 లక్షలు చెల్లించగా అదనంగా రూ.30 వేలు ఇవ్వాలని కోరాడంతో తాను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాని తెలిపారు. కాగా తాను డబ్బులు చెల్లించిన గాన తనకు అయా స్థలాన్ని స్వాధీనం పరచకపోగా తనపై దాడికి యత్నించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయన ఆవేధన వ్యక్తం చేశాడు. రమేశ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా జవహార్ నగర్ కు చెందిన మాజీ సైనికుడు ఎం. శ్రీనివాస్ రెడ్డి తన ఇల్లుకు వాచ్ మెన్ గా నియమించుకున్న వెంకటేశ్ కబ్జాలో ఉండి ఆ ఇల్లు తనదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయమై పలుమారు వెంకటేశ్ ను ఇల్లు ఖాళీచేయాలని అభ్యర్థించిన ఆయన ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసులు సైతం వెంకటేశ్ కే మద్ధదు పలతున్నాడని తెలిపారు. ఇట్టి విషయమై రాచకొండ పోలీసులు,హోం మంత్రి,మానవహక్కుల సంఘాలకు పిర్యాదు చేయడమం జరిగిందని అయినా తగిన న్యాయం జరుగ లేదని, వెంటనే ముఖ్య మంత్రి స్పందించి  తన ఇల్లు తనకు వచ్చేల ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రతినిధులు జె.భాస్కర్ రావు  , గాజుల తిరుపతి పాల్గొన్నారు.

No comments:
Write comments