కొత్త వాహానాలపై షోరూమ్ దోపిడి

 

గుంటూరు, జూలై 11, (globelmedianews.com)
కొత్తగా వాహనాన్ని కొనేటప్పుడే అందుకు సంబంధించిన మొత్తం ప్రొసెస్‌తో పాటు అవసమైన సర్టిఫికెట్లను షోరూం నిర్వాహులే అందించాలని రవాణాశాఖ ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఆన్‌లైన్‌లో సాగే ప్రక్రియే. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆర్‌సీకి రూ.760, లైఫ్‌టాక్స్‌ బండి విలువలో 9 నుంచి 12శాతం, ఇన్సూరెన్స్‌ రూ.1800,  నంబర్‌ ప్లేటుకు రూ. 250 వసూలు చేయాల్సి ఉంది.అయితే కొన్ని షోరూంల నిర్వాహకులు ఆర్‌సీకి రూ.1000 నుంచి 1,600, టాక్స్‌ రూ.1200, ఇన్సూరెన్స్‌ రూ.2,200, నంబర్‌ ప్లేటుకు రూ.400 వసూలు చేస్తున్నారు. 
కొత్త వాహానాలపై షోరూమ్ దోపిడి

దీంతోపాటు లైసెన్స్‌ లేకుంటే దాన్ని తామే ఇస్తామంటూ వసూలుకు పాల్పడుతున్నారు. ఇక హెల్మెట్‌లు బయటి మార్కెట్‌కంటే రూ.500 వరకు ఎక్కువగా గుంజుతున్నారు. మొత్తం మీద ఓ బైక్‌కు రూ. 2వేలు అదనంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో పలు వాహనాల కంపెనీలకు సంబంధించి సుమారు 220 షోరూంలున్నాయి. అన్ని చోట్ల ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్ల సిండికేటే.. షోరూం నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఏ షోరూంకు వెళ్లినా ఇదే ధరలుంటాయి. దీంతో వారు చెప్పిన ధర ఇచ్చి బైక్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక షోరూంలలో వాయిదాలతో వాహనాలు కొనేవాళ్లపై ఈ వాతలు కాస్త అధికంగానే ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నించినా లాభం లేకుండా ఉంది. దీనిపై ఎంవీఐ శివారెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

No comments:
Write comments