మధ్యాహ్న భోజనాల్లో వంట చెరుకు...

 

ఖమ్మం, జూన్ 28, (globelmedianews.com
ప్రభుత్వ పాఠశాలల్లో  వంట గదులు సరిగా లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్‌ సిలిండర్లు వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతోంది.పాఠశాలల్లో వంట చెరుకుతో మధ్యాహ్న భోజనం వండుతుండటంతో ప్రతి రోజూ తరగతి గదుల్లోకి పొగచూరుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ కారణంగా  అనారోగ్యానికి గురవుతున్నారు.పాఠశాలల్లో వంట నిర్వహణకు 14.2 కిలోల బరువున్న వాణిజ్య సిలిండర్లను అందజేశారు. దీని ధర రూ.754 ఉంది. సాధారణంగా గృహ వినియోగదారులకు రూ.271 రాయితీతో కూడినవి ఇస్తున్నారు. ఈ రాయితీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలకు వాణిజ్య సిలిండర్లను కేటాయించడంతో వీటికి రాయితీ వర్తించదు. 
మధ్యాహ్న భోజనాల్లో వంట చెరుకు...

వంట నిర్వాహకులకు ఇదికూడా ఇబ్బందిగా మారింది. వాణిజ్య సిలిండర్ల స్థానంలో ఉచితంగా సిలిండర్లను అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వంట నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలకు గ్యాస్‌ సిలిండర్లు, పొయ్యిలను సరఫరా చేసింది. పొగపాట్లకు తెరపడి చదువుకు అగచాట్లు తప్పాయని అందరూ భావించినా కథ మళ్లీ మొదటికే వచ్చింది. సిలిండరు ధర అధికంగా ఉండటం, నెలలో నాలుగైదు  అవసరం పడుతుండటంతో నిర్వాహకులకు వీటి వినియోగం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వారు వంట చెరుకుకే ప్రాధాన్యమిస్తున్నారు. వంట చెరుకు నుంచి వెలువడే పొగ కారణంగా విద్యార్థులు చదువులు సక్రమంగా సాగించకపోగా ఉపాధ్యాయులు సైతం పాఠాలు చెప్పడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందిస్తే ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయుల కష్టాలు దూరం కానున్నాయి

No comments:
Write comments