జల సంరక్షణలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించేలా కృషి చేయాలి

 

జలశక్తి అభియాన్ అవగాహన సదస్సులో కలెక్టర్  కృష్ణ భాస్కర్ 
సిరిసిల్ల, జూలై 25 (globelmedianews.com):
జిల్లాలోని అన్నీ గ్రామాలలో జల సంరక్షణ కార్యక్రమాలు విరివిగా చేపట్టి జలశక్తి అభియాన్ కార్యక్రమంలో జిల్లాను అగ్రభాగంలో నిలిపి ... జిల్లాకు రాష్ట్రం , దేశంలో ప్రత్యేక గుర్తింపు దక్కేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు .గురువారం సిరిసిల్ల పట్టణం లోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్ నందు జలశక్తి అభియాన్ కార్యక్రమం పై తంగళ్ళపల్లి , కోనరావుపేట , ముస్తాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు , సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు , ఎంపీడివోత, ఏపివోత, ఆసీలు, టీఏలు,ఎఫ్ ఏలు, సెక్రెటరీస్ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో  అవగాహన సదస్సు నిర్వహించారు.
జల సంరక్షణలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించేలా కృషి చేయాలి 

జిల్లా కలెక్టర్, జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యులు సుధాన్సు శేఖర్ దాస్, నోడల్ అధికారి యస్.హెచ్. అనురాగ్ సెహగల్ లు ఈ సదస్సు కు హాజరై ప్రజా ప్రతినిధులు , అధికారుల జలశక్తి అభియాన్ ప్రాముఖ్యతను తెలిపారు .   జలశక్తి అభియాన్ కార్యక్రమ ఉద్దేశ్యం , లక్ష్యాలు , జల సంరక్షణకు  పల్లెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులు ప్రజా ప్రతినిధులు , సిబ్బందికి సవివరంగా వివరించారు . వారి సందేహాలను నివృత్తి చేసారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .... జిల్లాలో జలశక్తి అభియాన్ కార్యక్రమం కంటే ముందు చెక్ డ్యాం ల నిర్మాణం , ఉపాధి హమీ పథకం,ఇతర పథకాల క్రింద  ఉపరితల జలసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు,చెరువుల పునరుద్ధరణ , రూప్ టాప్ వాటర్ హార్వెస్టెంగ్ నిర్మాణాలు, నీటి కుంటలు, వాటర్ షెడ్డుల అభివృద్ధి, సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడం, పెర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు, చెక్ డ్యాం నిర్మాణ పనులు, పాం ఫండ్లు, రీచార్జి బోర్వెల్స్, ఇంటింటికీ ఇంకుడు గుంత, మొక్కలు నాటే కార్యక్రమం వంటి కార్యక్రమాలు  పెద్దఎత్తున చేపట్టి నీటి సంరక్షణ కు కృషి చేశామన్నారు . ప్రస్తుతం కేంద్ర పథకం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమం సాధారణంగా చేపట్టిన పనుల కంటే యాభై శాతం ఎక్కువ పనులు చేయాలనీ అధికారులు , ప్రజా ప్రతినిధులను కలెక్టర్ కోరారు . జలశక్తి అభియాన్ కార్యక్రమం క్రింద పనులు మాత్రమే చేపట్టి వదిలేయకుండా ప్రజా భాగస్వామ్యం ను పెంచి  వాటి స్ఫూర్తీ ని చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు . చేసిన పనులు ప్రజలకు , రాష్ట్రం , దేశంలోని ఇతర ప్రాంతాలకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు .  వచ్చే సెప్టెంబర్ 15 కల్లా జల సంరక్షణ కు చేపట్టిన పనులు పూర్తీ చేయాలన్నారు .జలశక్తి అభియాన్ కేంద్ర అధికారుల బృందం సభ్యులు సుధాన్సు శేఖర్ దాస్ మట్లాడుతూ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టి ప్రజలందరికీ నీటి సంరక్షణ ఆవశ్యకతపై పూర్తి అవగాహన కలిగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని వర్గాల , వయసుల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు . జిల్లాలోని ప్రతి ఇంటికి జలశక్తి అభియాన్ సందేశం వెళ్లాలన్నారు. పిల్లలందరికీ నీటి సంరక్షణ ఆవశ్యకత ను తెలియజేయాలన్నారు . నీటి వృధా ను పూర్తిగా అరికట్టేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు .
జలశక్తి అభియాన్ నోడల్ అధికారి యస్.హెచ్. అనురాగ్ సెహగల్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ నేతృత్వంలో జల సంరక్షణ చర్యలు ప్రభావవంతంగా జరుగుతున్నాయన్నారు . ఆత్మవిశ్వాసంతో పనులు చేయడమే కాకుండా .... ఆత్మవిశ్వాసంతో జల సంరక్షణ చర్యలను వివరించాలన్నారు .

No comments:
Write comments