గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన..

 

వనపర్తి జూలై 13  (globelmedianews.com)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం వనపర్తి పట్టణంలో గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపనలు సిసి రోడ్ల నిర్మాణానికి, మటన్ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మొదటగా మంత్రి పట్టణంలోని 22 వ వార్డు నుండి నాగవరం వరకు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని వల్లబ్ నగర్ లో గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థాపన చేశారు. అదేవిధంగా 11వ వార్డు కమాన్ చౌరస్తా లో మటన్ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమీపంలోని నాగవరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ తండ్రి పెద్ద ముక్కుల కురుమూర్తి ని పరామర్శించారు. 
గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణం జరిపి ప్రతి ఒక్కరికి సౌకర్యం కలిగి ఉండేవిధంగా రోడ్ల నిర్మాణాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. అలాగే గ్రంథాలయ నిర్మాణాన్ని జరుపుటకు శంకుస్థాపన చేశామని ఆయన అన్నారు. గ్రంధాలయ నిర్మాణం వలన ఎంతోమందికి మేలు కలుగుతుందని ఆయన వ్యక్తపరుస్తూ గ్రంథాలయాల వల్ల ఎంతోమంది మేధావులు అయ్యారని ఆయన అన్నారు. అదేవిధంగా పట్టణంలో మటన్ మార్కెట్ భవన నిర్మాణం వల్ల అమ్మ వాళ్లకి కాకుండా మటన్ కొనుగోలుదారులకు సౌకర్యం కలుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో లోకనాథ్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బి లక్ష్మయ్య గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్ మాజీ చైర్మన్ kicha రెడ్డి ఎంపీపీ మాజీ కౌన్సిలర్లు గట్టు యాదవ్ శ్రీధర్ తిరుమల్ నందిమల్ల శ్యాం కుమార్ రమేష్ నాయక్ పాకనాటి కృష్ణ సుజాత టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ బండారి కృష్ణ ఎల్ఐసి  కృష్ణ యువజన అధ్యక్షుడు సూర్యవంశం గిరి తదితరులు పాల్గొన్నారు!

No comments:
Write comments