నానికి పీవీపీ లీగల్ నోటీసులు

 

హైద్రాబాద్, జూలై 16 (globelmedianews.com)
విజయవాడ ఎంపీ కేశినేని నానికి వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) లీగల్ నోటీసులు పంపారు. తనను నాని ఆర్థిక నేరస్థుడంటూ వ్యాఖ్యలు చేశారని.. నేర స్వభావం కలిగిన వాడినని అసత్య ప్రచారం చేశారన్నారు పీవీపీ. జగన్ బ్లాక్ మనీ హవాలా చేశానని నిరాధార ఆరోపణలు చేశారని.. దేశంలోనే కాదు ఎక్కడా తనపై కేసు లేవని పొట్లూరి తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా తనపై బురద జల్లారని..పనామా పేపర్ల లో తన పేరు ఉందన్నారని.. ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి, క్షమాపణలు చెప్పాలని పీవీపీ నోటీసుల్లో ప్రస్తావించారు. 
నానికి పీవీపీ లీగల్ నోటీసులు

ఎంపీ కేశినేనికి పంపిన నోటీసుల్ని జత పరుస్తూ పీవీపీ ట్వీట్ చేశారు. ‘కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను’అన్నారు. మరి నోటీసులపై నాని ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా  ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ  షో మాస్టర్ కి  టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను..పీవీపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల ట్వీట్ వార్‌పై కూడా స్పందించారు. ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టర్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తారా.. ఏది ఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము అంటూ ట్వీట్ చేశారు.

No comments:
Write comments