శ్రీదేవి సహజ మరణం కాదు..హత్య

 

కేరళ మాజీ డీజీపీ రిషిరాజ్‌ సింగ్‌ వెల్లడి 
న్యూఢిల్లీ, జూలై13 (globelmedianews.com)
తన అందం, అభినయంతో వెండి తెరపై అతిలోక సుందరిగా కోట్లాదిమంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి శ్రీదేవి మరణంపై కుట్ర కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి మరణించి ఏడాది దాటినా ఆమె మరణంపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
శ్రీదేవి సహజ మరణం కాదు..హత్య!

తాజాగా శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో కుట్ర కోణం దాగి ఉందంటూ కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్‌ సింగ్‌ మునిగి చనిపోయి ఉండకపోవచ్చుఅంటూ ఓ దిన పత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్‌ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్‌ తనతో పంచుకున్నారని వ్యాసంలో పేర్కొన్నారు.

No comments:
Write comments