మూడో అంతస్తు నుండి పారిపోవడానికి ప్రయత్నించిన బాలిక

 

సూర్యాపేట, జూలై 23, (globelmedianews.com)
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మైనర్ బాలిక కు ప్రాణాపాయం తప్పింది. పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఎస్.కె .మహబాబి సోమవారం పుట్టినరోజు సందర్భంగా ఎలాగైనా ఇంటికి వెళదామని అనుకుంది. వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని టీచర్లకు చెప్పి, పాఠశాల మూడవ అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి కిందకు దిగడానికి ప్రయత్నం చేసింది. 
మూడో అంతస్తు నుండి పారిపోవడానికి ప్రయత్నించిన బాలిక

పాఠశాలకు ముందువైపు పిల్లలు కింద పడి పోకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ ను పట్టుకుని మెల్లగా కిందకు దిగడానికి ప్రయత్నించింది. రెండవ అంతస్తు వరకు దిగగానే ఉపాధ్యాయురాలు గమనించి ఇనుప గ్రిల్స్ నుండి  బాలికను రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. వెంటనే పాఠశాల సిబ్బంది, మొబైల్ డిస్పెన్సరీ అంబులెన్స్ సహాయంతో బాలికను కింద కు దించడంతో ప్రాణాపాయం తప్పింది.

No comments:
Write comments