శ్రీశైలం ప్రాజెక్టుకు కొత్త ముప్పు

 

హైదరాబద్ జూలై 16  (globelmedianews.com
శ్రీశైలం ప్రాజెక్టుకు కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర అణుశక్తి సంస్థకు అనుమతి లభించడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. అదే జరిగితే కృష్ణా జలాలన్నీ కలుషితమై రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించి సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తున్న తరుణంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు అందుకు ప్రతిబంధకంగా మారనున్నాయి. 
శ్రీశైలం ప్రాజెక్టుకు కొత్త ముప్పు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం డ్యామ్‌కు యురేనియం తవ్వకాల వల్ల ముప్పు కలుగుతుందని సాగునీటి శాఖ నిపుణులు చెబుతున్నారు.ముడి యురేనియాన్ని శుద్ధి చేయడానికి అత్యధికంగా నీళ్లు అవసరమవుతాయి. నల్లమలలోని అమ్రాబాద్ మండలం, కొన్ని గ్రామాలలోని 83 చదరపు కి.మీ. పరిధిలో కృష్ణానది మినహాయించి ఎక్కడ కూడా నీటి లభ్యత లేదు. దీంతో యురేనియం శుద్ధికి కృష్ణా జలాలు తప్ప వేరే మార్గం లేదు. ముడి యురేనియం నుంచి వెలువడే అణుశక్తితో కాంక్రీట్ నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఒక్క శ్రీశైలమే కాదు. శ్రీశైలం వరద జలాలు, నికర జలాలపై ఆధారపడి నిర్మించిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల భవితవ్యం కూడా నీరుగారిపోతుందనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. యురేనియంతో కలుషితమైన నీటిని సాగు భూములకు మళ్లిస్తే భూమి సహజ లక్షణాన్ని కోల్పోతుందని వారంటున్నారు.

No comments:
Write comments