మళ్లీ బోల్డ్ గా రాధిక ఆప్టే

 

ముంబై, జూలై 19 (globelmedianews.com
బోల్డ్ సన్నివేశాలు, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే రాధికా ఆప్టే మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకు ‘పర్చెడ్’ సినిమాలో టాప్‌లెస్ సన్నివేశాలతో ఇంటర్నెట్‌ను హీటెక్కించిన ఆప్టే తాజాగా ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ నటుడు దేవ్ పటేల్‌తో జతకట్టింది. అతడితో కలిసి నటించిన ‘వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో అర్థనగ్నంగా తన యెద అందాలను ప్రదర్శించి అభిమానులకు షాకిచ్చింది.ఈ బ్రిటీష్-అమెరికా చిత్రం ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. 2018, సెప్టెంబరు 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 1న అమెరికాలో విడుదల చేశారు. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. 
మళ్లీ బోల్డ్ గా రాధిక ఆప్టే 

పాకిస్తాన్‌లో నివసించే సమీరా అనే అమ్మాయిని బ్రిటన్‌కు చెందిన ఓ ముస్లిం అబ్బాయి కిడ్నాప్ చేస్తాడు. అయితే, ఆ కిడ్నాప్ అతడు కావాలనే చేస్తాడా? లేదా ఆమె ఇంట్లో నుంచి పారిపోయేందుక కిడ్నాప్ నాటకం ఆడుతుందా అనేది మిగతా కథ. అయితే, ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ మధ్య కొన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులోని ఓ బెడ్ సీన్‌లో రాధికా దుస్తులన్నీ విప్పేసి తన యెద సంపదను ప్రదర్శించింది. ఇటీవల ఈ సీన్లు పోర్న్ వెబ్‌సైట్లలో లీకయ్యాయి. ఈ వీడియోల లీక్‌పై రాధికా ఆప్టే స్పందిస్తూ.. ‘‘ఈ సినిమాలో ఇంకా చాలామంచి సన్నివేశాలు ఉన్నాయి. కేవలం నగ్నంగా ఉన్న వీడియో మాత్రమే లీకవడానికి సమాజంలో ఉన్న సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులే కారణం. ఆ సీన్లలో నాతోపాటు దేవ్ పటేల్ కూడా నటించాడు. మరి అతడి పేరు మీద ఎందుకు సీన్లు లీకైనట్లు చూపించడం లేదు?’’ అని ప్రశ్నించింది. రాధికా ఆప్టే తెలుగులో ‘రక్త చరిత్ర’తోపాటు బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో నటించింది. అంతేకాదు, దక్షిణాది హీరోలపై కామెంట్ చేసి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

No comments:
Write comments