ప్రైవేట్ కంపెనీలకు నిరాశే...

 

విజయవాడ, జూలై 24 (globelmedianews.com)
ఏపీలో కొలువు దీరిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని సాధ్య‌మై నంత వ‌ర‌కు త‌గ్గించే కార్య‌క్ర‌మంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. వాస్త‌వానికి నిరుద్యోగ స‌మ‌స్య అనేది ఇప్ప‌టికిప్పుడు పుట్టుకొచ్చిన స‌మ‌స్య కాదు. ఇప్ప‌టితో అంత‌మ‌య్యే స‌మ‌స్యా కాదు. అయినా కూడా రాత్రికిరాత్రి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందేన‌ని జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టిన వైనం మాత్రం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. అంతేకాదు, జగన్ అవగాహనా రాహిత్యాన్ని చాటిచెబుతోంది. రాష్ట్రంలో స్థాపించ‌బోయే ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌లోనూ స్థానికుల‌కు 75శాతం చొప్పున ఉద్యోగాలు క‌ల్పించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన బిల్లును ఆయ‌న అసెంబ్లీలో కూడా ప్ర‌వేశ పెట్టారు.
 ప్రైవేట్ కంపెనీలకు నిరాశే...

ఫ‌లితంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టి, ప‌రిశ్ర‌మ‌లు స్థాపించే ప్రైవేటు కంపెనీలు ఇక‌పై ఖ‌చ్చితంగా రాష్ట్రంలోని నిరు ద్యోగుల‌కు 75 శాతం చొప్పున ఉద్యోగాల‌ను క‌ల్పించి, నిబంధ‌న‌ల ప్ర‌కారం జీత భ‌త్యాల‌ను చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఉద్యోగ భ‌ద్ర‌త కూడా క‌ల్పించారు. ఇది వినేందుకు చాలా సొంపుగానే ఉన్నా.. అమ‌లు మాత్రం అంత తేలిక కాదు. దీని కి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.రాజ‌కీయంగా ఇలాంటి నిర్ణ‌యాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. జ‌గ‌న్ వ‌చ్చాడు కాబట్టి.. ఇలాంటి నిర్ణ‌యాలు వ‌చ్చాయి! అనే ప్ర‌క‌ట‌న‌లు, రాజ‌కీయ నినాదాలు చేసుకునేందుకు బాగానే ఉన్నా.. వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్న కొన్ని రాష్ట్రాల్లో అంగుళ‌మంత అభివృద్ధి కూడా జ‌రిగిన దాఖ‌లా మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.పరిశ్రమలు పెద్దగా లేని కొత్త రాష్ట్రమైన ఏపీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పారిశ్రామిక వేత్తలను నిరుత్సాహ పరిచినట్టు అవుతోంది. ఒక వ్యక్తి వంద కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటే... తాను సమాజ సేవ కోసం పెట్టడు కదా, తాను మరింత సంపాదించడానికి పెడతాడు. ఆ క్రమంలో కొందరికి ఉద్యోగాలు వస్తాయి. దాని చుట్టూ పరోక్షంగా అనేక మంది బతుకుతారు. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. తద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. మరిన్ని కంపెనీలు వస్తాయి. ఇది ఒక సైకిల్. అందుకే పరిశ్రమలు తమ రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సాహం ఇస్తాయి. రాయితీలు ఇస్తాయి. అంతేగాని కంపెనీలకు నచ్చని నిర్ణయాలు తీసుకోవు.  ఇండియాలో లేబర్ చట్టం వల్ల మన పారిశ్రామిక రంగం చాలా కుంటుపడింది. పాత సినిమాలు ఏవి చూసినా అందులో కార్మికుల ధర్నాలు కనిపిస్తాయి.  కానీ ఇప్పటి సినిమాల్లో అది కనిపించదు. కార్మిక చట్టాలు ఐటీ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ఆ రంగానికి లేబర్ చట్టం వర్తించకుండా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొందరి హక్కులకు ఇబ్బంది కలిగినా దేశం .ఎంతో పురోగతి సాధించింది. పాలకులకు ఈ అవగాహన చాలా ముఖ్యం. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లోనూ స్థానికులకు ఉద్యోగాల కల్పన నిబంధ‌న‌ అమ‌లు చేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అయితే, సాధ్యం కాక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యాలు ఇప్ప‌టికీ ఫైళ్ల‌లోనే మూలుగుతున్నాయి. దీనికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ప‌రిస్థితి కూడా కార‌ణం కావొచ్చు. విద్యార్థుల్లో నైపుణ్యం లేక పోవ‌డంతో ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నిచేసే స‌త్తా కోల్పోతున్నార‌ని సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే అనేక సార్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల‌కు శ్రీకారం చుట్టారు. పోనీ ఇవైనా దూకుడుగా వెళ్తున్నాయా? అంటే అదీ లేదు. ప్ర‌ధానంగా ప్రాథ‌మిక విద్య‌లోనే మ‌నోళ్లు చ‌తికిల ప‌డుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఐటీ రంగాన్ని తీసుకుంటే.. విస్తృత‌మైన ఆంగ్ల ప‌రిజ్ఞానంతోపాటు క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ అవ‌స‌రంఇక‌, ఫార్మా రంగాన్ని తీసుకుంటే.. విస్తృత‌మైన ర‌సాయ‌శాస్త్ర ప‌టిమ అవ‌స‌రం. అదేస‌మ‌యంలో ఆంగ్ల ప‌రిజ్ఞానం కూడా కావాలి. అయితే, ఈ త‌ర‌హా నైపుణ్యం ఉన్న అభ్య‌ర్థులు మ‌న‌ద‌గ్గ‌ర చాలా చాలా త‌క్కువ‌. అందుకే ఐటీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఇప్ప‌టికీ బెంగ‌ళూరు, ఢిల్లీల నుంచి ఉద్యోగుల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ కొత్త‌గా తీసుకువ‌చ్చిన బిల్లు వ‌ల్ల 75 శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వాల‌ని అంటే.. అది సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు, పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి ఏర్ప‌డితే.. దానికి ఎవ‌రు బాధ్యులు ? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఈ విష‌యంలో పున‌రాలోచ‌న ఉంటే మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.నర్సులంతా కేరళ నుంచి వస్తున్నారు. మన వాళ్లు ఆ పనిచేయడానికి ఆసక్తి చూపరు. వంట వాళ్లు ఒడిసా నుంచి వస్తున్నారు. కొన్ని రకాల లేబర్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తుంది.మరి లోకల్ నర్సులనే తీసుకోవలని నిబంధన పెడితే సాధ్యమవుతుందా? ఇదే అసలు లాజిక్. జగన్ నిర్ణయంతో పరిశ్రమల రాక తగ్గి నిరుద్యోగం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. 

No comments:
Write comments