ఏటీఎం దొంగలు ఆరెస్టు

 

రంగారెడ్డి జూలై 15, (globelmedianews.com)
వరుస ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను సైబరాబాద్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నాడు మోయినాబాద్ పోలీసు స్టేషన్ లో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. గోల్కొండ కు చెందిన మహమ్మద్ సర్ఫరాజ్,  మహమ్మద్ అమీర్ రాయిస్, మొయినాబాద్ మండలం మూర్తుజ గూడ గ్రామానికి చెందిన మహమ్మద్ ఫర్దిన్  గత కొన్ని నెలలుగా ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరు ఇప్పటికి 6 చోట్ల ఎటిఎం దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ అన్నారు.  
ఏటీఎం దొంగలు ఆరెస్టు

నార్సింగ్ లో మూడు చోట్ల,  రాయదుర్గం లో ఒకచోట,  మొయినాబాద్ లో రెండు చోట్ల ఆక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకుల ఏటీఎంలలు చోరీలకు పాల్పడ్డారు కానీ డబ్బులు దొరకలేదు . నిందితులంతా చదువుకుంటున్నారు.  వీరు ఎటిఎం చోరీలకు పాల్పడటం కోసం డబ్బులు ఉన్న చోట తీయడానికి రాడ్లని ఉపయోగించారు.   జల్సాలకు అలవాటు పడి ఎటిఎం లో చోరీలకు పాల్పడుతున్నారని అయన అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను పట్టుకున్నామని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని అన్నారు.. బ్యాంక్ లకు ఎటిఎం ల నిర్వాహకులకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఎటిఎం ల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ని పక్కాగా నియమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ మీడియా భేటీలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, మొయినబాద్ సిఐ వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.

No comments:
Write comments