మెడిసిన్ ర్యాంకర్ కుశ్వంత్ కు కేటీఆర్ ఆర్థిక సహాయం..

 

హైదరాబాద్, జూలై 26  (globelmedianews.com)
భూపాలపల్లి పట్టాణ కేంద్రానికి చెందిన కుశ్వంత్ ఇటీవలే మెడిసిన్ ప్రవేశ పరీక్ష (నీట్) లోరాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిన సందర్భంగా  శాసన సభ్యుడు గండ్ర వెంకట రమణ రెడ్డి ఉన్నత చదువుల కోసం2లక్షల ఆర్థిక అందించారు. శుక్రవారం నాడు  హైదరాబాద్ ప్రగతి భవన్ లో  తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావును వరంగల్ రూరల్ జిల్లా చైర్ పర్సన్  గండ్రజ్యోతి  కుశ్వంత్ ను వారి కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళి వారి స్థితిగతులను తెలియజేశారు. 
మెడిసిన్ ర్యాంకర్ కుశ్వంత్ కు కేటీఆర్ ఆర్థిక సహాయం..

కుశ్వంత్ కు ఉన్నత చదువుల కోసం కేటీఆర్  5 లక్షల రూపాయలు అందించారు. భవిష్యత్ మరిన్ని చదువుకోవడం కోసం అవసరమయ్యే ఖర్చు చూసుకుంటనాని హామీ ఇచ్చారు. మంచిగా చదువుకొని తెలంగాణ రాష్ట్రంలో మంచి డాక్టర్ కావాలని, తెలుగు ప్రజల గౌరవాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట తెరాస జిల్లా నాయకులు పోలుసాని లక్ష్మీ నరసింహ రావు, మరియు భద్రయ్య, కుశ్వంత్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

No comments:
Write comments